TGSRTC Home Delivery | సరుకులు నేరుగా ఇంటికే డెలివరి
కొత్త నిర్ణయం ప్రకటించిన టీజీఆర్‌టీసీ
ఈ నెల 27 నుంచి కొత్త సేవలు ప్రారంభం
HYDERABAD| హైదరాబాద్ వాసులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ వినిపించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్న టీజీఎస్ ఆర్టీసీ, అటు కార్గో సేవలను కూడా విస్తరిస్తోంది. తద్వారా ప్రజలకు సేవలందించటమే కాకుండా.. సంస్థకు అదనపు ఆదాయం కూడా భారీగానే సమకూరుతోంది. అయితే.. ఇప్పటివరకు అధిక సంఖ్యలో కార్గో కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా సేవలందించిన టీజీఎస్ ఆర్టీసీ.. కార్గో ద్వారా మంచి ఫలితాలే వస్తుంది. దీంతో విశేష ఆధరణ పొందుతుండటంతో.. ఈ సేవలను మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. కాగా.. ఇప్పుడు నేరుగా ఇంటి వద్దకే వచ్చి పార్శిళ్లు హోం డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. ఈ హోం డెలివరీ సేవల గురించి గత కొంతకాలం కింద నుంచే కసరత్తు చేస్తుండగా.. ఈ నెల 27 నుంచి ప్రారంభించనుంది. ఈ మేరకు.. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఆర్‌టీసీ అభివ్రుద్ధి కోసం ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గానూ లాజిస్టిక్స్(కార్గో) సేవలను టీజీఎస్ఆర్టీసీ మరింతగా విస్తరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్‌లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే.. పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లో ఈ హో డెలివరీ సేవలను ప్రారంభించనున్నారు.
* * *
Leave A Comment